![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -721 లో.... సూరజ్ తన అదృష్ట దేవత అంటూ ఫోన్ లో ఉన్న జ్యోత్స్న ఫోటోని జ్యోత్స్నకే చూపిస్తాడు. అది జ్యోత్స్న చూసి షాక్ అవుతుంది. నా ఫోటో చూపిస్తావేంట్రా అని జ్యోత్స్న కోప్పడుతుంటే నువ్వు కోపంలో ఇంకా క్యూట్ గా ఉంటావని సూరజ్ అంటాడు. జ్యోత్స్న ఇంకా చిరాకుపడుతుంది. ఆ తర్వాత సిటీ లో బెస్ట్ రెస్టారెంట్ చైర్మెన్ లు అందరు మీటింగ్ కి అటెండ్ అవుతారు. అక్కడ ఒకతను మాలిని, దక్షిణామూర్తి ఇద్దరితో మాట్లాడతాడు. మీరు ఈ సిటీకీ కొత్తగా వచ్చారా ఇక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారా అని మాలినిని అతను అడుగుతాడు. ఉన్నారని మాలిని చెప్తుంది. ఎవరని అతను అడుగగా శివన్నారాయణ గారు అని మాలిన అంటుంది. దాంతో కార్తీక్, శివన్నారాయణలతో పాటు అందరు షాక్ అవుతారు. అంటే ఇప్పుడు టాప్ రెస్టారెంట్ చైర్మెన్ లు అందరు ఇక్కడే ఉన్నాం కదా ఒక ఫ్యామిలీలాగా అని చెప్తున్నానని మాలిని కవర్ చేస్తుంది.
ఆ తర్వాత మాలిని వాళ్ళ రెస్టారెంట్ DM రెస్టారెంట్ తప్ప మిగతా రెస్టారెంట్లు అంతా బెస్ట్ రెస్టారెంట్ పోటీలో నుంచి తప్పుకుంటాయి. ఇక్కడ ఎప్పుడు బెస్ట్ రెస్టారెంట్ జ్యోత్స్న రెస్టారెంట్ అని శివన్నారాయణ అంటాడు. ఎవరు బెస్ట్ అనే దాని గురించి పోటీ కాదు ఏ రెస్టారెంట్ మంచి ఫుడ్ అందిస్తుందో దాని గురించి అని మాలిని అంటుంది. ఇప్పుడు పోటీపడాల్సింది జ్యోత్స్న రెస్టారెంట్ , DM రెస్టారెంట్ అని మాలిని అనగానే మేం పోటీ పడట్లేదని చెప్పి శివన్నారాయణ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మిమ్మల్ని ఎలాగైనా పోటీపడేలా నేను చేస్తాను కదా అని మాలిని అనుకుంటుంది. మరొకవైపు శివన్నారాయణ ఇంటికి వస్తాడు. సర్ మనం పోటీపడితే బాగుండేదని సూరజ్ అనగానే వాళ్ళతో మనకీ పోటీ ఏంటని శివన్నారాయణ అంటాడు. వాళ్ళతో పోటీపడితే ఓడిపోతారని భయమా అని సూరజ్ అనగానే శివన్నారాయణ అతనిపై కోప్పడతాడు.
అప్పుడే దక్షిణామూర్తి ఫోన్ చేస్తాడు. ఏంటి నాతో పోటీ పడితే ఓడిపోతానని భయమా అని శివన్నారాయణని దక్షిణామూర్తి రెచ్చగొడుతాడు. అది నా పేరులోనే లేదని శివన్నారాయణ కోప్పడతాడు. నువ్వు నాకే భయపడుతున్నావని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడేసరికి నీతో నాకేంటని శివన్నారాయణ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు. అయినా వాళ్ళతో పోటీ ఎందుకని పారిజాతం అంటుంది. పోటీపడాలి అప్పుడే నా మెట్టింటి పౌరుషం వాళ్ళకి తెలుస్తుందని సుమిత్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |